Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 5:24 pm Posted by : ramakrishna

శానిటేషన్ కార్మికులకు వేతనాలు పెంచి ఇవ్వాలి

  • ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి
  • టీయుసీఐ జిల్లా నాయకులు కె.రాజేశ్వర్

 

భీమ్ గల్, బతుకమ్మ : పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకానుగుణంగా మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ల్లో పని చేస్తున్న శానిటేషన్ కార్మికులకు ప్రభుత్వం నెలకు రూ. 26వేల వేత్తనాన్ని ప్రతి నెల 5 తేదీ లోపు చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ (టీ యు సీ ఐ) డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ కె. రాజేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక మున్సిపాలిటీ ఆఫీస్ ముందు కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించి పలు డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ కు అంద జేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేతనం పెంచి ఇవ్వడంతో పాటుగా వారికి ఇన్సూరెన్సు, ఈ ఎస్ ఐ సౌకర్యాలు కలిపించాలన్నారు.2025 జనాభా ప్రాతిపాధికాన 500 జనాభాకు ఒక్కరు చొప్పున శానిటేషన్ కార్మికులను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. 2011 జనాభా ప్రాతిపాధికానా సిబ్బంది నియామకం ఇప్పటికి కొనసాగించడం మూలన కార్మికులకు పని భారం పెరిగి ఒత్తిడికి గురి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ ఏం కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, నూతన అప్గ్రేడ్ మున్సిపాలిటీ ల్లో పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించి, మేడే కానుకలను కార్మికులకు అందజేయాలన్నారు.ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి నేరుగా మున్సిపల్ నుండే కార్మికులకు వేతనాలను చెల్లించాలని ఆయన మెమోరాండం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు ఓంకార్, రాజన్న, విజయ,వికాస్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.