కామారెడ్డి, బతుకమ్మ : మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని పారిశుధ్య కార్మికులు కామారెడ్డి మున్సిపాలిటీ ముందు భైఠాయించి ధర్నా చేశారు. దీంతో పట్టణంలో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. సుమారు వందమందికి పైగా ఔట్సోర్సింగ్ కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు.