పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలి

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : పట్టణంలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని, దోమల వ్యాప్తి అరికట్టేందుకు ఫాగింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని వార్డ్ నెంబర్ 17, అశోక్ నగర్, స్నేహపురి కాలనీ, తదితర వార్డుల్లో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలోని అన్ని వార్డుల్లో నిరంతర పారిశుధ్య పనులను చేపట్టాలని మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సూచించారు. వర్షాకాలంలో మురికి కాల్వల్లోని నీరు ప్రవహించే విధంగా చూడాలని,...