పారిశుద్ధ్యం అస్తవ్యస్తం 

దోమల బెడదతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు  బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో దోమల బెడదతో  ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దోమల బెడదను తట్టుకునేందుకు మస్కిటో కాయిల్స్ అగరు వత్తులు వినియోగించాల్సి వస్తుంది. చీకటి పడితే చాలు దోమల బెడద భరించ లేకపోతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమల నివారణకు గ్రామపంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దోమల నివారణ కోసం పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా గ్రామపంచాయతీ...