పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. దోమల నివారణ చర్యలు శూన్యం..
బాన్సువాడ మున్సిపాలిటీలో దోమల బెడదతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు బాన్సువాడ , బతుకమ్మ : బాన్సువాడ మున్సిపాలిటీలో దోమల బెడదతో ప్రజలు వేగలేకపోతున్నారు. చీకటి పడితే చాలు ముసురుతున్న దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమల బెడదను తట్టుకునేందుకు ప్రజలు మస్కిటో కాయిల్స్, అగర్ వత్తులు వినియోగించాల్సి వస్తోంది. చీకటి పడితే చాలు దోమల బెడద భరించలేక పోతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమల నివారణకు మున్సిపాలిటీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.సాధారణంగా సంధ్య సమయంలో ఇంటి తలుపులు తెరిచి...