Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 August 2024, 9:11 pm Posted by : ramakrishna

మొక్కలు నాటిన సంగీతా ఖాందేష్

బతుకమ్మ, ఆర్మూర్ : రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛదనంగా – పచ్చదనంగా ఉండాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమమును చేపట్టారు అందులో భాగంగా ఆర్మూర్ లో స్వచ్ఛధనం- పచ్చదనం కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

ఈ సందర్బంగా మున్సిపల్ రెండవ వార్డు కౌన్సిలర్ , బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షురాలు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్ సంగీతా ఖాందేష్ మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతమంతా స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టి అందులో భాగంగా వన మహోత్సవము అమలు చేస్తున్నారని తెలిపారు.ప్రాథమిక పాఠశాల వడ్డెర కాలనీ లో మరియు కాలనీ లోని రోడ్డుకు ఇరు ప్రక్కల మొక్కలు నాటారు.

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, మన ఇంటి సమీపములో నాటిన మొక్కలను నీళ్లు పోసి కాపాడాలని కోరారు. అదే విదంగా పరిసరాలను పరిశుబ్రముగా ఉంచుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమములో పట్టణ కాంగ్రెస్ నాయకులు ఖాందేష్ సత్యం, మున్సిపల్ అధికారులు షకీల్ వార్డు ప్రత్యేక అధికారి చక్రధర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, నరేశ్, రాజారామ్, అర్పి మమత సమాఖ్య సభ్యులు మున్సిపల్ సిబ్బంది సురేష్, గోపి, పోశన్న తదితరులు పాల్గొన్నారు.

Sangeeta Khandesh planted saplings