Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 June 2025, 7:19 pm Posted by : ramakrishna

భీంగల్ ఎస్సైగా సందీప్

భీంగల్, బతుకమ్మ : భీంగల్ పోలీస్ స్టేషన్ ఎస్సై సందీప్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన మహేష్ బదిలీపై వెళ్లారు. నిజామాబాద్ ఎస్ బీలో పని చేస్తున్న సందీప్ బదిలీపై భీంగల్ కు వచ్చారు. ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సందీప్ భీంగల్ సిఐ సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసారు. ఎస్సై సందీప్ గతంలో నిజామాబాద్ నగరంలోని 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పని చేసి ఎలక్షన్ కోడ్ సమయంలో నిర్మల్  జిల్లాకు బదిలీపై వెళ్లారు. భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు కృషి చేస్తానని ఎస్సై సందీప్ తెలిపారు.