. . . డోజర్ ని అదుపులోకి తీసుకున్న అధికారులు
సాలూరు, బతుకమ్మ :
మండలంలోని తగ్గేల్లి మంజీరా పరివాహక ప్రాంతంలో అనుమతులకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న డోజర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నిర్మాణాల కోసం ఇసుకను తరలించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా డోజర్‌తో ఇసుకను నింపుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది.సమాచారం అందుకున్న ఆర్‌ఐలు శంకర్, ఆనంద్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమతులకు విరుద్ధంగా ఇసుకను నింపుతున్న డోజర్‌ను స్వాధీనం చేసుకుని, తదుపరి చర్యల నిమిత్తం సాలూరు తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టి నిబంధనల మేరకు చర్యలు తీసుకోనున్నారు.