ఇసుక ట్రాక్టర్ పట్టివేత

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టకున్నట్లు మోపాల్ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓ యాదగిరి తెలిపారు. మోపాల్ మండలంలోని కస్బాగ్ తండా గ్రామానికి చెందిన హరిసింగ్ తన ట్రాక్టర్ లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మోపాల్ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓ యాదగిరి తన సిబ్బందితో పట్టుకుని స్టేషన్ కు తరలించి, అతనిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇకపై ఎవరైనా సరైన అనుమతి పత్రాలు లేకుండా ఇసుక, మొరం తరలిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని...