ఇసుక ట్రాక్టర్ సీజ్
బతుకమ్మ, మాచారెడ్డి: పాల్వంచ మండలం బండ రామేశ్వరం పల్లి వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను సీజ్ చేసినట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా సహజం వనరులను అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సహజ వనరుల దోపిడీకి స్వస్తి పలికి చట్టం పరిధిలో తమ వ్యాపారాలు చేసుకోలేని కోరారు.