. . . నలుగురిని తహసీల్ధార్ ఎదుట బైండోవర్ చేసిన పోలీసులు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ను సీజ్ చేసినట్లు ఐదవ టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు. మల్లారంకు చెందిన బొల్లం నర్సయ్యకు చెందిన టిప్పర్ టీఎస్ 16 యూబీ 1909ను పట్టుకుని దానిని నడుపుతున్న గాంధీనగర్ కు చెందిన డ్రైవర్ ఎత్తరి చిన్నకొండయ్యను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి టిప్పర్ ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. గతంలో ఇసుక మొరం అక్రమ రవాణాకు పాల్పడిన వారిలో నాగారం ఒడ్డెరకాలనీకి చెందిన మక్కల గోపాల్, దండ్ల సాయికుమార్, మల్లారంకు చెందిన బొల్లం నర్సయ్య, మల్లారంకు చెందిన మమ్మాయి అరుణ్, బొల్లం నర్సయ్యలను నిజామాబాద్ దక్షిణ మండలం తహసీల్ధార్ ముందు బైండోవర్ చేసినట్లు ఎస్సై తెలిపారు. వారి వద్ద నుంచి రూ.5 లక్షల పూచికత్తు తీసుకుని సంవత్సరం కాలంలో ఎలాంటి నేరాలకు పాల్పడిన చట్టరీత్యా కేసులు నమోదుతో పాటు వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని ఎమ్మార్వో ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
.