Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 7:57 pm Posted by : ramakrishna

ఎం.ఐ.వి యాప్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా ప్రారంభం

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ సబ్‌-కలెక్టర్ సర్, బోధన్ తహసీల్దార్ విటల్, ఎంపీడీవో బోధన్ కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఎం.ఐ.వి (మన ఇసుక వాహనం) ఆన్‌లైన్ వెబ్‌సైట్/యాప్ ద్వారా ఇసుకను విడుదల చేశారు. సిద్ధాపూర్ ఇసుక రీచ్ నుండి సంగం గ్రామానికి ఇసుకను తరలించే ప్రక్రియను ఈ సందర్భంగా సబ్‌-కలెక్టర్ వికాస్ మాతో అధికారికంగా ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా పారదర్శక విధానంలో ఇసుక సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎం.ఐ.వి యాప్ ద్వారా ఇసుక పంపిణీ వ్యవస్థను సులభతరం చేసి, లబ్ధిదారులకు సమయానికి ఇసుక అందేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

 

Sand supply to Indiramma's homes begins through MIV app