ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలి
. . . తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ ఆదేశం నిజామాబాద్, బతుకమ్మ : ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్దిదారులకు ఇసుక, మొరం అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తహసీల్దార్లకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం తహశీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో ప్రత్యేక సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో, లబ్దిదారులను అన్ని విధాలుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణాలకు ముందుకు వచ్చే...