Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 July 2025, 9:47 pm Posted by : ramakrishna

మంజీరా నదిలో ఇసుక తవ్వకాలు..

  • రెండు గ్రామాల మధ్య వివాధం
  • మంజీరాలో నది పరివాహక ప్రాంతంలో సరిహద్దు వివాదం
  • రెండు గ్రామాల ప్రజలు, ట్రాక్టర్ యజమానుల మధ్య గొడవలు

Sand mining in the Manjira River..

నిజామాబాద్ / కోటగిరి, బతుకమ్మ : మంజీరా నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు పరివాహక ప్రాంత సరిహద్దు రెండు గ్రామలలో వివాదానికి కారణమౌతుంది. ప్రభుత్వం అధికార యంత్రాంగం ఇచ్చిన ఇసుక రీచ్ వలన తమ గ్రామంలో 200 వ్యవసాయ బోర్లు వట్టిపోతాయని గ్రామస్థులు ఇసుక రీచ్ లో తవ్వకాలను అడ్డుకున్నారు. దానితో పరివాహక ప్రాంతంలో స్థానిక ఇందిరమ్మ ఇండ్లు, డెవలప్ మెంట్ పనులు, ఆసుపత్రి నిర్మాణం, జాతీయ రహదారి విస్థరణ పనుల కోసం ఇసుక తవ్వకాలు జరుగుతుంటే పోతంగల్ మండలంలో పోతంగల్, కోడిచర్ల మధ్య వివాదానికి కారణమైంది. పోతంగల్ మండలం సరిహద్ధులో మంజీరా నది ప్రవహిస్తుంది. దాని పరివాహక గ్రామాలుగా పోతంగల్, సుంకిని, కోడిచర్ల, కారేగాం, కల్లూర్, హంగర్గా గ్రామాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో జిల్లా అధికార యంత్రాంగం సుంకిని గ్రామంలో ఇసుక లభ్యతతో రీచ్ కు అనుమతి ఇచ్చారు. కాని ఆ గ్రామస్థులే అడ్డుకున్నారు. సుంకినిలో గతంలో చాలసార్లు ఇసుక తవ్వకాలు జరుగగా గ్రామానికి మేలు జరుగకపోగా పంటలు వట్టిపోతాయని ఇసుక తవ్వకాలకు ససేమీరా అంటున్నారు. ఐతే ఇటీవల కోడిచర్ల గ్రామ సరిహద్ధులో జరుగుతున్న ఇసుక తవ్వకాలను పోతంగల్ గ్రామస్థులు అడ్డు చెపట్టడం ఆ గ్రామ ప్రజల ఆగ్రహానికి కారమైంది. దానితో రెండు గ్రామాల మధ్య సరిహద్ధు వివాదం చెలరేగింది.

  •  మా ఇసుక మాకే కావాలి.. కోడిచర్ల గ్రామస్తులు..

మా ఇసుక మాకే కావాలంటూ  పోతాంగల్ మండలం కోడిచర్ల గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.  పోతంగల్ గ్రామానికి చెందిన ఇసుక వే బిల్లుల పై  కోడిచర్ల గ్రామ శివారు సర్వే నెంబర్ 334 నుండి అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా చేస్తున్నారని కోడిచర్ల గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా తమ గ్రామ శివారు నుండి ఇసుక తరలింపున అడ్డుకోవాలని తహసీల్దార్ గంగాధర్ కు ఫిర్యాదు చేయడంతో వివాదం చెలరేగింది.

Sand mining in the Manjira River..

  • పర్మిషన్ కోసం పడిగాపులు…. సరిహద్దుల పంచాయతీతో నిలిచిన పోతంగల్ ట్రాక్టర్లు

ఇసుక తరలింపు విషయంలో రెండు గ్రామాలలో సరిహద్దుల పంచాయతీ విషయంలో  70 ఇసుక ట్రాక్టర్లు రోడ్డుపై నిలిచిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇసుక తరలింపు విషయంలో తమ గ్రామ శివారు 334 సర్వే నంబర్ నుండి అక్రమంగా  ఇసుక తరలిస్తున్నారని  కోడిచర్ల గ్రామస్తులు సోమవారం తాసిల్దార్ గంగాధర్ కు ఫిర్యాదు చేసిన విదితమే. పోతంగల్ గ్రామానికి చెందిన  ట్రాక్టర్ యజమానులకు రెవిన్యూ అధికారులు పర్మిషన్  ఇస్తామని చెప్పడంతోనే ఒకరోజు ముందు కార్మీకులతో  తాము ఇసుక ను లోడ్ చేసుకొని  మంజీరా నది సుమారు 75 ట్రాక్టర్ వరకు  బ్రిడ్జ్ పై ఉంచి అధికారులకు వే బిల్లుల కోసం ఎదురుచూస్తున్న  వే బిల్లులు ఇవ్వడం లేదంటూ  ట్రాక్టర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Sand mining in the Manjira River..