బతుకమ్మ, భిక్కనూరు: అక్రమ ఇసుక వ్యాపారం మండలంలో జోరు అందుకుంది ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా అధికారుల అండదండలతో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. వాగుల్లో రోజంతా ఇసుక కుప్పలు పోసి సాయంత్రం ఉదయం రాత్రి వేళల్లో గ్రామాలకు ట్రాక్టర్ ల ద్వారా తరలిస్తున్నారు. ముఖ్యంగా భిక్కనూరు మండలంలో తిప్పాపూర్, బస్వాపూర్ అడవిలో ఉన్న వాగుల నుంచి అక్రమ ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు కొనసాగుతుంది. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు.