ఇసుక మేటల తొలగింపు త్వరగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ లింగంపేట్, బతుకమ్మ : వరద బాధిత రైతులకు లబ్ది కలిగేలా పొలాలలో వేసిన ఇసుక మేటల తొలగింపు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ లింగంపేట మండలం బురిగిద్ద గ్రామంలో ఇటీవల సంభవించిన అధిక వర్షాల సమయంలో వచ్చిన వరదలతో ఇసుక మేట వేసిన రైతు సభావత్ లక్ష్మి వారి పొలంలో ఈజీఎస్ ద్వారా చేపట్టిన ఇసుకమేటల తొలగింపు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధిత రైతుతో మాట్లాడి...