- రాత్రులలో తవ్వకాలు.. డంపింగ్
- పగలు దర్జాగా అమ్మకాలు
- సీజ్ చేసిన ట్రాక్టర్ లలో గంటల వ్యవధిలో రిలీజ్
- పెద్దవాగు కేంద్రంగా అక్రమ ఇసుక తవ్వకాలు
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండల లోని పెద్దవాగు నుంచి రాత్రిపూట తవ్విన ఇసుకను అక్రమంగా డంప్ చేస్తున్నారు. అక్కడ పట్టపగలు ఇలా దర్జాగా ఇసుకను ట్రాక్టర్ లలో, టిప్పర్ లలో తరలించు ప్రక్రియ బహిరంగంగా సాగుతుంది. ఎందుకంటే ఇటీవల రెవిన్యూ అధికారులు శుక్రవారం సాయంత్రం మూడు ట్రాక్టర్ ల ఇసుకను పట్టుకుని సీజ్ చేశారు. కాని గంటల వ్యవధిలో అదే ట్రాక్టర్ లలో ఇసుక మళ్లీ అక్రమంగా రవాణా అవుతుంది..

రాష్ర్టంలో కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. ఎందుకంటే ఒక పార్టీ అంటే మరో పార్టీకి పడదు. అది రాష్ర్టమైనా, జిల్లాఐనా. కాని నిజామాబాద్ జిల్లాలో ఒక్క చోట ఆ మాత్ర రెండు పార్టీల నేతలు ఒక్కటే మాట, ఒక్కటే వాటా అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే అధికార మార్పిడి జరిగినప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీకి వంతపాడే బిటి బ్యాచ్ లు ఉండటంతో అది సాధ్యమౌతుంది. జిల్లాలోని బాల్కోండ నియోజకవర్గంలో బిఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఇసుక దందా చేస్తున్నారు. అందులో మాజీ మంత్రి అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నేతలు కూడ బలుక్కుని అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా చేస్తు కాసుల వేటలో పడ్డారు. గతంలో మంత్రిగా పని చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదు. నడిచిందల్లా ట్రాక్టర్ లలో అవసరాల నిమిత్తం, దానిని సాకుగా తీసుకుని ఇసుక దందా కొదరు చేశారు. కాని కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇప్పుడు ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా అనేది బహిరంగంగా సాగుతుంది. గ్రామాలను శాసించే విడిసీలకు లక్షలకు లక్షలను వేలం వెర్రిగా చెల్లించి గ్రామాల పరిధిలోని వాగులు వంకలలో ఇసుకను తోడేస్తున్నారు. వాటిలో రాత్రికి రాత్రి తవ్వకాలు చేస్తు గుట్టలు గుట్టలుగా డంపింగ్ చేస్తున్నారు. వాటిని పట్ట పగలు టిప్పర్లలో, ట్రాక్టర్ ల ద్వార బహిరంగంగా విక్రయిస్తున్నారు. స్థానిక తహసీల్ధార్ వద్ధ ఒక్కటి రెండు ట్రాక్టర్ లకు అనుమతులు తీసుకోవడం వాటి వే బిల్లుల ఆధారంగా ఇసుకను తరలించే ప్రక్రియ జరుగుతుంది.

బాల్కొండ నియోజకవర్గంకు చెందిన టిఎస్ఎంఐడిసి చైర్మెన్ గా వ్యవహరిస్తున్న ఈరవత్రి అనిల్ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు రవాణ జరుగుతుండటం పార్టీకి చెడ్డపేరు తెస్తుంది. ప్రధానంగా నియోజకవర్గంపై కన్నేసిన నేతల అనుచరులు, ఒక నేత పుత్రరత్నం నియోజకవర్గంలో ఇసుక తవ్వాలలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. వారికి ప్రతిపక్ష బిఆర్ఎస్ నాయకులు తోడు కావడంతో ఇసుక తరలిపోతుంది. రెవిన్యూ, మైనింగ్, పోలీస్ అధికారుల అండదండలు ఉండటంతో టిప్పర్ లలో తరలుతున్నఇసుక కనిపించడం లేదు. టిప్పర్ లను వదిలి ట్రాక్టర్ లను పట్టుకుని నామ మాత్రపు జరిమానా విధించి వదిలేసిన టిప్పర్ లలో గంటల వ్యవధిలో ఇసుక అక్రమ రవాణ జరుగుతుంది. బాల్కొండ నియోజకవర్గం ఇసుక దందా ఇప్పుడు జిల్లాలో చర్చకు దారి తీసింది.
