Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 December 2024, 8:07 pm Posted by : ramakrishna

మంథనిలో ఒకేరోజు పూర్తి బిల్లులు చెల్లింపు 

ఆర్మూర్, బతుకమ్మ:  వ్యవసాయ విద్యుత్ బిల్లులు ఒకే రోజు చెల్లించి మంథని  గ్రామం ఆదర్శంగా నిలిచింది. ఆలూర్ మండలంలోని మంథని గ్రామంలో వ్యవసాయ మోటర్ సర్ ఛార్జ్ బిల్లులను చెల్లించాలని లైన్ మెన్ సల్ల శ్రీనివాస్ యాదవ్ రైతులను కోరారు. ఉప కేంద్రం పెద్ద మనుషులు గాదెపల్లి నర్సారెడ్డి, గొల్ల నర్సయ్య స్పందించి మొత్తం 655 మోటర్లకు గాను రూ. 360 చొప్పున ఒకే రోజు చెల్లింపులు చేయించి గ్రామాన్ని ఆదర్శంగా నిలబెట్టారు. యాకుబ్, సృచిత్ కుమార్ బిల్లులు తీసుకోగా, అసిస్టెంట్ లైన్ మెన్ లింబాద్రి, లైన్ ఇన్స్పెక్టర్ ముజీబ్ పర్యవేక్షించారు. బిల్లులను చెల్లించే విధంగా సహకరించిన పెద్ద మనుషులకు, రైతులకు విద్యుత్ శాఖధికారులు కృతజ్ఞతలు తెలిపారు.