- పాదరక్షలతోనే నివాళులు
- మొన్న జగ్జీవన్ కు, నేడు అంబేడ్కర్ కు
- కార్యక్రమం అయ్యాక ఫోటో దిగారంట
ఇందూర్, బతుకమ్మ: పాదరక్షలతోనే నివాళులు అర్పించడం… అడిగితే కార్యక్రమం పూర్తయ్యాక వేసుకున్నాం… తప్పేంటి అని అనడం ఆనవాయితీగా మారింది. ఒక్కసారి జరిగితే పొరపాటు, అదే మళ్ళీ జరిగితే….ఏమంటారో…
విద్యుత్ శాఖ కార్యాలయం ప్రధాన ద్వారం పక్కన మహనీయుల చిత్రపటాలను పెట్టి నివాళులు అర్పించడంలో నేర్పరులు. అదీనూ పాదరక్షలతోనే… దీనిలో భాగంగానే డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని పవర్ హౌస్ లోని విద్యుత్ భవన్ ఎదుట ఆయన చిత్రపటానికి పాదరక్షలతోనే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మొన్న బాబు జగ్జీవన్ రాం జయంతిన ఇదే తరహా కొనసాగింది. అదేంటండి… చెప్పులు వేసుకొనే నివాళులు అర్పించారని పత్రికలో వచ్చిందని అడిగితే, కార్యక్రమం పూర్తయ్యాక పాదరక్షలు వేసుకొని గ్రూప్ ఫోటో దిగితే తప్పేలా అవుతుందని వారు సముదాయింపు మాటలు చెప్పడం విష్మయం గొలిపింది. ఆ రోజు జరిగిన తప్పిదానికి ఎలాగోలా సమాధానాలు చెప్పుకొని బాబోయ్ గండం గడిచిందనుకున్నారు. మళ్ళీ అంబేడ్కర్ జయంతిన చెప్పులతో నివాళులు.. పొరపాటు అనేది ఒక్కసారి… తరచుగా జరిగితే… నివాళులు అర్పించిన మేధావులకే తెలియాలి… దీనికి ఏమి సమాధానం చెబుతారో చూద్దాం… ఇంకో విషయం.. అంబేడ్కర్ గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడాలని అక్కడున్నవారు అధికారిని కోరారు. ఆ మాట్లాడేది ఏముంది, మొన్ననే మాట్లాడాను గదా అని చెప్పడం గమనార్హం.
