Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 December 2024, 5:01 pm Posted by : ramakrishna

బీసీ విద్యార్థుల సమర శంఖారావం పోస్టర్ ఆవిష్కరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్, హైదరాబాద్ లో నిర్వహించే బీసీ విద్యార్థుల సమర శంఖారావం పోస్టర్ ను శనివారం బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సిరివెసు సంతోష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నసుమారుగా రూ.4,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్  స్కాలర్షిప్ లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల కు ఏ విధంగా అయితే స్కాలర్షిప్లు విడుదల చేస్తున్నారో బీసీ విద్యార్థులకు కూడా ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. బీసీ గురుకులకు, సంక్షేమ వసతి గృహాలలో సొంత భవనాలు నిర్మించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.  ప్రైవేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరు సంఖ్యను పెంచాలన్నారు. హైదరాబాదులో 10 ఎకరాలలో పూలే నాలెడ్జ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో నుండి అన్ని జిల్లాల బీసీ విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి బీసీ విద్యార్థుల సమర శంఖారావాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సిరివేని సంతోష్ కుమార్, నరాల సుధాకర్, బుస్స ఆంజనేయులు, కరిపే రవింధర్, కొయ్యాడ శంకర్, దర్శనం దేవేందర్, చంద్రమోహన్, శ్రీలత, మురళి, బాలన్న, చంటి, మాధవ్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.