బాన్సువాడ, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సమగ్ర శిక్ష సోషల్ ఆడిట్ కార్యక్రమం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఏ విధంగా ఖర్చు అవుతున్నాయి, పాఠశాలలో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, విద్యార్థులకు అందుతున్న సేవలు నాణ్యతగా ఉన్నాయా అనే అంశాలపై సమగ్రంగా చర్చించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాలపై కూడా సమీక్ష నిర్వహించారు.సోషల్ ఆడిట్ ద్వారా పాఠశాలల్లో నిధుల వినియోగం, మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న సేవలపై పారదర్శకత పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సోషల్ ఆడిట్ పర్యవేక్షకురాలు సీతక్క మమత, హెడ్‌మాస్టర్ లక్క నరహరి,13వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖలెక్, కోఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, ఖామర్ సుల్తానా గౌస్ పాషా, అర్ఫాత్, మేరూ భార్గవ్, పేరెంట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.