Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 August 2025, 12:46 pm Posted by : ramakrishna

సెల్యూట్ కామారెడ్డి పోలీస్

 

. . . 68 మంది ని కాపాడిన పోలీసులు

 కామారెడ్డి, బతుకమ్మ:

భారీ వర్షాలలో ప్రాణాలకు తెగిస్తున్నారు పోలిసన్నలు.   కామారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు అధికార యంత్రాంగం ప్రాణనష్టం, ఆస్తి నష్టం నివారణ చర్యలకు ఉపక్రమించింది. అందుకు గాను ఎస్డీఆర్ఎఫ్ టీంలను రంగంలోకి దించింది. పోలీస్ శాఖ సైతం 48 గంటలుగా వర్షానికి ఎదురొడ్డి జాతీయ రహదారులు కొట్టుకుపోయిన, వాగులు, వంకలు పోంగిపోర్లుతున్న, లోతట్టు ప్రాంతాల లో ప్రజలు చిక్కుకున్న యూనిపాం సర్వీస్  సేవా కార్యక్రమాలు ఎత్తుకుంది. శాంతిభద్రతలకే కాకుండా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు విపత్తులోను స్పంధించిన తీరును కామారెడ్డి పోలిసులను శహబాష్ అని మెచ్చుకోకుండా ఉండలేరు.

Salute Kamareddy Police

కామారెడ్డి పోలీస్ బాస్ రాజేష్ చంద్ర స్వయంగా రంగంలోకి దిగడంతో పోలీస్  కానిస్టేబుల్ వరకు స్టేషన్ లను వదిలి కార్యక్షేత్రం లోకి దిగింది. కామారెడ్డి జిల్లాలో వినాయక చవితి నాడు కుండపోత వర్షం అతలకుతలం చేయడంతో కామారెడ్డి పట్టణంలో హౌజింగ్ బోర్డు, బతుకమ్మ కుంట, జి ఆర్ కాలనీ నీట మునిగాయి. వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చుటకు భారీ వర్షం లెక్క చేయకుండా రిస్క్యూ ఆపరేషన్ చేసింది. బుధవారం రాత్రి సైతం కామారెడ్డి పట్టణ శివారులోని ఉగ్రవాయి వద్ద వృద్ధ ఆశ్రమం వెనుక గోర్రేల షెడ్ లో చిక్కుకున్న 68 మంది సురక్షితంగా గట్టుకు చేర్చారు. జేసీబీకి తాడును కట్టి వరద ఉద్రుతి ఎదురొడ్డి కామారెడ్డి పట్టణ సీఐ నరహరీ, ఆర్ఐ సతీష్ లతో పాటు కానిస్టేబుల్ లు స్వయంగా రంగంలోకి దిగి తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు. ప్రధానంగా వృద్ధులను, మహిళలు, చిన్నారులను వీపుపై మోస్తు ప్రవాహానికి ఎదురుదితు ఒడ్డుకు చెర్చారు. 63 మంది కోసం గంటల కొద్ది జరిగిన ఆపరేషన్, రిస్కూ చేసిన పోలీసులకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు.

 

అధికార యంత్రాంగం స్పందన భేష్….

కామారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అధిక వర్షాల వలన  జాతీయ రహదారి 44 పైకి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వరద నీరు రావడంతో వాహనాలు అయిపోయి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని గమనించి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తో కలిసి జాతీయ రహదారి వెంబడి పర్యటించి సహా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Salute Kamareddy Police

బుదవారం  జెసిబిలతో  జాతీయ రహదారిపై నిలిచిన  నీటిని క్లియర్ చేశారు. అదేవిధంగా వరదల్లో చిక్కుకున్న వాహనదారులకు జాతీయ రహదారి 44 పై  జి ఆర్ కాలనీ వద్ద 500 మందికి,  రోడ్డు వద్ద జాతీయ రహదారి 44 పై 500 మందికి, పాత రాజంపల్లి రోడ్డు వద్ద జాతీయ రహదారి ఎన్ హెచ్  44 పై 500 మందికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ నేతృత్వంలో ఆహారాన్ని ఏర్పాటు చేసి వాహనదారులు ఆహారం కోసం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆహారాన్ని అందించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి జి ఆర్ కాలనీ వద్ద ప్రజలకు సహాయ చర్యలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.జంగంపల్లి లో జాతీయ రహదారి వద్ధ వరద ఉద్రుతి, ప్రత్యామ్నాయ చర్యలు కామారెడ్డి జిల్లా ఎస్పీ తో పాటు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు.

Salute Kamareddy Police