. . . తొలి మహిళా డిప్యూటీ మేయర్ గా రికార్డ్
. . . దారుస్సలామ్ ప్రకటన
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ డిప్యూటీ మేయర్ గా 54వ డివిజన్ కార్పొరేటర్ సల్మా తహసీన్ ను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఈ మేరకు ఆదివారం దారుస్సలామ్ లో జరిగిన మజ్లిస్ పార్టీ సమావేశంలో అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించినట్టు సమాచారం. నిజామాబాద్ నగర నాల్గవ డిప్యూటీ మేయర్ గా మజిలీస్ పార్టీకి అవకాశం దక్కింది. నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఏ పార్టీకి మెజారిటీ రాని విషయం తెలిసిందే.. 17 స్థానాలు గెలిచినా కాంగ్రెస్, 1 బిఆర్ ఎస్ కాండిడేట్ , మజ్లిస్ 14 సీట్ల మద్దత్తు తో మేయర్ సీట్ కైవసం చేసుకోవడం ఖాయమైంది. ఈ నెపత్యంలో డిప్యూటీ మేయర్ పదవి మజ్లిస్ కు కేటాయించాగా అపార్టీ నగర అధ్యక్షులు, 52 డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ షకీల్ సతీమణి కీ అవకాశం కలిపించింది… సల్మా తహసీన్ నిజామాబాద్ నగర పాలక సంస్థ తొలి డిప్యూటీ మహిళ మేయర్ గా రికార్డు సృష్టించ నున్నారు. మేయర్ పదవి కూడా మహిళ జనరల్ కు కేటాయించగా కాంగ్రెస్ పార్టీ నుంచి 5 మహిళలు గెలువగా ఎంపిక ప్రక్రియ కొలిక్కిరాలేదు. సోమవారం మేయర్, డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్ ల ఎంపిక కు బల్దీయ అధికారులు ఏర్పాట్లు చేసారు. నిజామాబాద్ నగర పాలక సంస్థను ఈసారి మహిళలే నడపడం ఖాయమైంది.
