ప్రైవేట్ వ్యాపారులకే ధాన్యం విక్రయం
రుద్రూర్, బతుకమ్మ: కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వారం రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని సేకరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల అంశంలో రైస్ మిల్లర్ల వ్యవహారం ఇటు అధికారులకు, అటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మొన్న కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యాన్ని రోడ్లపై, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోస్తున్నారు. క్యూ కడుతున్న ప్రైవేటు వ్యాపారులు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రైవేటు...