జూనియర్ కళాశాల ఉపాధ్యాయులకు వెంటనే వేతనాలు చెల్లించాలి
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని మైనారిటీ ఉర్దూ మీడియం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గత పదేళ్లకు పైగా మైనారిటీ విద్యార్థినులకు బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడం అత్యంత బాధాకరమని విద్యార్థి సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు, వారికి పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఆర్మూర్...