Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 5:55 pm Posted by : ramakrishna

ఐసిఈయూ అధ్యక్షులుగా సక్కి సతీష్

 

బోధన్, బతుకమ్మ :

 

ఎల్ఐసి లోని కార్మిక రంగానికి చెందిన ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ఐ సిఈయూ ) బోధన్ బ్రాంచ్ కమిటీ అధ్యక్షులుగా సక్కి సతీష్ (సత్య నారాయణ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్రాంచ్ కమిటీ కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షులుగా ఎం శ్రీనివాస్, కార్యదర్శిగా ఏ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి -1గా ఏం జీవన్, సంయుక్త కార్యదర్శి -2 గా గంగారామ్, కోశాధికారిగా సంతోష్, కార్యవర్గ సభ్యుడిగా శంకర్, డీసీఎం గా ఆర్ నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.