Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 6:08 pm Posted by : ramakrishna

9వ ఫెడరేషన్ కప్ జాతీయ క్రీడా పోటీలకు ఎంపికైన సాయి శివ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాట్మెంటన్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 22వ తేది వరకు నిర్వహించిన డాక్టర్ ఏఎస్ రావు నగర్ హైదరాబాద్ లోని మారుతి బాల్ బ్యాడ్మింటన్ గ్రౌండ్ లో నిజామాబాద్ కు చెందిన సాయిశివ జాతీయ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. శిక్షణ శిబిరంలో ప్రతిభా కనబరిచిన సాయిశివ ఈనెల 24 నుండి 29వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలో జరిగే తొమ్మిదవ ఫెడరేషన్ కప్ జాతీయ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఫెడరేషన్ కప్ క్రీడా పోటీలకు ఎంపికైన సాయి శివ ను నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు గడ్డం శ్రావణ్ రెడ్డి, చైర్మన్ ప్రీమియర్ దేవేందర్ రెడ్డి, పాటర్న్ మానస గణేష్,  ప్రధాన కార్యదర్శి శ్యాం, వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ రెడ్డి, కోశాధికారి రాజేశ్వర్, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, కాశిరెడ్డి సునీత, రాజేష్, నిర్వహణ కార్యదర్శి నాగేష్ , కామారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నర్సింగ్ రావు , కృష్ణమూర్తి బాల్ బ్యాడ్మింటన్ సంఘం కార్యవర్గ సభ్యులు అభినందించారు.