నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్య బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా పోతరాజు సాయి చైతన్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2016 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సాయి చైతన్య మొన్నటి వరకు నార్కొటిక్స్ విభాగం ఎస్పీగా పనిచేశారు. ఇటీవల రాష్ట్రంలో 21మంది ఐపీఎస్ ల బదిలీ సందర్భంగా సాయిచైతన్యను నిజామాబాద్ సీపీగా నియమించిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం నగరంలో ప్రసిద్ధ నీలకంఠేశ్వర దేవాలయంలో సతీసమేతంగా కొత్త పోలీస్ కమిషనర్ పూజలు నిర్వహించారు. అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా...