Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2024, 7:37 pm Posted by : ramakrishna

ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సాయి బాబా గౌడ్

ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ మార్కేర్ కమిటీ చైర్మన్ గా సాయి బాబా గౌడ్ నియమితులు అయ్యారు. ఆర్మూర్ మార్కెట్ కమిటికి నూతన పాలకవర్గంను నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మెన్ గా సాయిబాబా గౌడ్, వైస్ చైర్మెన్ గా విట్టం జీవన్, డైరెక్టర్ లుగా చిన్న గంగారాం, చిన్న ఉషన్న, అజ్మీర పీర్ సింగ్, రవి కుమార్, అమ్రుత రావు, చంద్రశేఖర్ రెడ్డి, సయ్యద్ ఫయాజ్, మల్లారెడ్డి, పింజా ఉషారాణీ, బూస మల్లయ్య, మునిరుద్ధీన్, మత్యం సంతోష్ లతో కుడిన కార్యవర్గంను నియమాకం అయ్యారు. రెండు సంవత్సరాల కాల పరిమితి కలిగిన మార్కెట్ కమిటి చైర్మెన్ సాయిబాబా గౌడ్ కు మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియామక ప్రత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా సాయి బాబా గౌడ్ మాట్లాడుతూ ఈ భాద్యతలు అప్పగించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, బోధన్ ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అదేవిధంగా ఇందుకు సహకరించిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,  రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ బాధ్యులు వినయ్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.