Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 September 2025, 7:03 pm Posted by : ramakrishna

దుర్గా దేవికి కుంకుమ పూజలు

బతుకమ్మ,కమ్మర్ పల్లి : మండలంలోని నర్సాపూర్ గ్రామంలో సన్ రైజ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవికి కుంకుమ పూజలను సోమవారం ఘనంగా నిర్వహించారు.మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి కుంకుమార్చనలు,హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సాయంకాల సమయాన దేవి పల్లకిసేవతో గ్రామం మొత్తం ఊరేగిస్తూ భజనలు చేస్తూ, దేవి నామస్మరణలతో మార్మోగాయి. యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దుర్గా దేవి శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమానికి మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.