- సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి
- ఏదైనా సమస్య వస్తే వెంటనే 8712659856 లేదా 100 నెంబర్లకు కాల్ చేయండి
- ప్రజల క్షేమమే మా లక్ష్యం
- ధర్పల్లి ఎస్ఐ కళ్యాణి
బతుకమ్మ, ధర్పల్లి రూరల్: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు ధర్పల్లి ఎస్సై కళ్యాణి షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. విద్యార్థులకు మత్తు పదార్థాలపై దూరంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మహిళల భద్రతపై మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మహిళలను వేధిస్తే కఠిన శిక్షలు అమలవుతున్నాయని విద్యార్థులకు వివరించారు. వాహనాలు మైనర్ బాలికలు,బాలురు మైనర్ వ్యక్తులు వాహనాలు నడిపితే వారిని కఠినంగా శికషిస్తామని హెచ్చరించారు. మీ గ్రామాల్లో మీ పరిసర ప్రాంతాల్లో అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇయ్యాలని తెలిపారు. ధర్పల్లి ఎస్సై 8712659856 నంబర్ కి గానీ 100 నంబర్ కాల్ చేయాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేస్తూ మహిళ ఎస్సై కళ్యాణి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సుధాకర్,నాంజి,మోహన్ రెడ్డి, సంతోష్ మరియు షీ టీం సిబ్బంది శ్రీకాంత్, రేఖారాణి,హరితారాణి,నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.