పారిశుధ్య కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : అనునిత్యం ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే విధుల్లో నిమగ్నమై ఉండే పారిశుధ్య కార్మికుల భద్రతా, సంక్షేమానికి ప్రాధ్యాన్యత ఇవ్వాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన మాన్యువల్ స్కావెంజర్స్ సర్వే కమిటీ సమావేశం జరిగింది. పారిశుధ్య కార్మికులకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఆయా శాఖల ద్వారా పారిశుధ్య కార్మికులకు అమలవుతున్న పథకాలు, ప్రయోజనాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు....