Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 September 2024, 4:25 pm Posted by : ramakrishna

పీర్టీయూ జిల్లా కార్యదర్శిగా సాదుల గంగాధర్ ఎన్నిక

బతుకమ్మ, ఏర్గట్ల : ఆదివారం నిజామాబాద్ బస్వా గార్డెన్ లో  నిర్వహించిన పిఆర్ టి యు టీఎస్ జిల్లా కార్యవర్గ ఎన్నికలలో ఏర్గట్ల ప్రాథమిక పాఠశాలకు చెందిన సాధుల గంగాధర్ జిల్లా కార్యదర్శిగా  పోటీ చేసి 133 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందినట్లు ఏర్గట్ల మండల పిఆర్ టియు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణ ప్రసాద్, రాజశేఖర్ తెలియజేశారు. అత్యధిక మెజార్టీతో గెలవడానికి సహకరించిన అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సాదుల గంగాధర్ ను   రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దశేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి సుధాకర్,మండల కార్యవర్గ సభ్యులు సురేష్, సుధాకర్ మమత, మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.