Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2025, 3:51 pm Posted by : ramakrishna

జిల్లా పాలన అధికారులను కలసిన సాధన ఎన్జీవో సిబ్బంది

నిజామాబాద్, బతుకమ్మ :   సాధన ఎన్జీవో సిబ్బంది సోమవారం జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ ప్రాజెక్ట్ లో భాగంగా జిల్లా పాలన  అధికారులను కలిశారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, డీపీవో, డీడబ్ల్యూవో, జిల్లా విద్యాశాఖ అధికారులు ఎన్జీవో  డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మికులు,  బాలల  అక్రమ రవాణా, అలాగే బాలలపై జరుతున్న హింస నిర్మూలన కోసం జిల్లా, మండల స్థాయిలలో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో సంస్థ  జిల్లా కో ఆర్డినేటర్ మధుసూదన్, నవీపేట్ బోధన్ భీంగల్ మండల సోషల్ మొబైలిజర్ చరణ్ సింగ్, సాయి చరణ్ గౌడ్, నిరీక్షణ, తదితరులు పాల్గొన్నారు.