Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 September 2025, 7:01 pm Posted by : ramakrishna

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో సోమవారం మహిళా ఆడపడుచులు అంగరంగ వైభవంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలందరూ బతుకమ్మలను ఒక్క దగ్గరగా చేర్చి చప్పట్లు కొడుతూ ఆటపాటలతో పాటలు పాడుతూ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ వేడుకల్లో చివరి రోజున ‘సద్దుల బతుకమ్మ’ లేదా ‘పెద్ద బతుకమ్మ’గా గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ ఏడాది ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) తిథి,సద్దుల బతుకమ్మ వేడుకళాంటారనీ పండితులు చెబుతున్నారు. బతుకమ్మ వేడుకల్లో చివరి రోజున ‘సద్దుల బతుకమ్మ’ లేదా ‘పెద్ద బతుకమ్మ’గా గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ ఏడాది ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) తిథి సోమ, మంగళవారాల్లో ఉండడడంతో… కొన్ని ప్రాంతాల్లో సోమవారం, మరికొన్ని చోట్ల మంగళవారం సద్దుల బతుకమ్మను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద పళ్ళెంలో గుమ్మడి ఆకులు, రంగులు అద్దిన గునుగు పూలు, తంగేడు, ఇతర రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. సద్దులను నైవేద్యం పెట్టి, పూజలు చేస్తారు. అనంతరం రాత్రి వరకూ ఆటపాటలతో అమ్మవారిని కొలిచి, బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.