నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోర్గం గ్రామంలో గ్రామ వీడిసి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ పండగను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపడుచులు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది మహిళలు జరుపుకునే పెద్ద పండుగని తెలిపారు. ప్రకృతిలో లభించే పూలను పూజించే పండుగ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేదని అది తెలంగాణ ప్రత్యేక పండగానే తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతికి బతుకమ్మ ఒక ఉదాహరణని అన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు తెలంగాణ సాంప్రదాయ పండుగైన బతుకమ్మను ఎంతో గొప్పగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళా మణులు ఎంతో సంతోషంగా సహజసిద్ధమైన రకరకాల రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ పండుగ ను ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. బతుకమ్మ పాటలను ఆలపిస్తూ బతుకమ్మ ఆటను ఆడారు.

