సర్కార్ కు రైతు సెగ
ఆంక్షలు విధించిన పట్టించుకోని రైతులు జాతీయ రహదారిపై బైఠాయించిన అన్నదాత బతుకమ్మ నిజామాబాద్ : జిల్లా రైతులు ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులు చేపట్టిన తొలి నిరసనకు నిజామాబాద్ వేదికైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ విషయంలో ఉన్న షరతులు తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతులు శనివారం జాతీయ రహదారిని దిగ్భందించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎర్రజొన్న రైతుల బకాయిల కోసం ఉద్యమించిన రైతులు మరోసారి ఆర్మూర్ వేదికగా ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. రాజకీయ పార్టీలకతీతంగా రైతులు రుణమాఫీ...