Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 January 2025, 1:03 pm Posted by : ramakrishna

ఎన్నికల కోసమే రైతుబంధు

. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శ

బాల్కొండ, బతుకమ్మ: ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధును తెరపైకి తెచ్చిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సాగు సంక్షేమ పరిస్థితులపై అధ్యయనానికి ఏర్పాటైన కమిటీ జిల్లాలో పర్యటిస్తోంది. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, కోటిరెడ్డి మెండోరా మండలం బుస్సాపూర్ లో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్టంలో రైతు ఆత్మహత్యలన్నీ కాంగ్రెస్ హత్యలేనని ఆరోపించారు. రాష్ర్టంలో కోతల ప్రభుత్వం నడుస్తోందని, రుణ మాఫీ పేరుతో రైతులను మోసం చేసిందన్నారు. రైతుల పక్షాన నిలబడేందుకు బీఆర్ఎస్ అధ్యయన కమిటీ  రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు  వెళ్తామన్నారు.

Rythu Bandhu is for election