అవగాహనకు రాకుండానే హడావుడి

రైస్ మిల్లర్లతో ఒక అవగాహనకు రాకముందే ప్రభుత్వం హడావుడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోంది. రైస్ మిల్లర్లు తమ షరతులను ప్రభుత్వం ముందుంచారు. దీనిపై ఒక క్లారిటీ రాకముందే ప్రభుత్వం హడావుడిగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోంది. జిల్లాలో మొత్తం 480 కొనుగోలు కేంద్రాలను తెరవాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే 250 కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. అయితే ఎక్కడా కూడా ధాన్యం సేకరించిన దాఖలాలు లేవు. రైతులు అడిగితే రేపుమాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం మద్దతుధర,...