Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2025, 7:23 pm Posted by : ramakrishna

డీఎస్ కు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి నివాళి

  • కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  తెలంగాణ ప్రదేశ్ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ జయంతి సందర్భంగా  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నగరంలోని  కంటేశ్వర్ బైపాస్ లో గల దళపతి శ్రీనివాస్ విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మపురి శ్రీనివాస్  రాజ్యసభ సభ్యునిగా మాజీ మంత్రిగా పిసిసి అధ్యక్షునిగా ఎన్నో ఉన్నత పదవులు చేశారని, రెండు పర్యాయాలు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికరణ తీసుకువచ్చిన ఘనత డి.శ్రీనివాస్ దే అన్నారు. డి.శ్రీనివాస్ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని  కార్యకర్తలకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని నిజాంబాద్ జిల్లాలో ఎంతో అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత డి.శ్రీనివాస్ దేని కొనియాడారు. తదుపరి వినాయక్నగర్ లో గల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతి సందర్బంగా పూల మాల వేసి నివాళులు అర్పించి తెలంగాణ రాష్ట్ర సాధనకై ఎలా పోరడు అన్న విషయాన్నీ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కొనియాడారు. ఈ సందర్బంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆసిఫాబాద్ వంకిడి గ్రామంలో జన్మించి స్వాతంత్ర్ం కోసం పోరాటం చేశారు. ఆసిఫాబాద్ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సాధనకై తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో తన స్థలాన్ని కేటాయించి వాటర్ హౌస్ గా మార్చారు. అయన ఆశయాలను ప్రతి ఒక్క పౌరుడు ఆచరిస్తూ ముందుకు సాగాలి అని కొనియాడారు.ఈ కార్యక్రమం లో డీసీసీ జిల్లా అధ్యక్షులు మనలా మోహన్ రెడ్డి,ఎఏంసి చైర్మన్ ముప్పా గంగాధర్,డిచిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, మాజీ ఎంపీపీ యాదగిరి నాయక్, పద్మశాలి నగర అధ్యక్షులు పెంటూ దత్తద్రి, తదితరులు పాల్గొన్నారు.

Rural MLA Dr. Bhupathi Reddy pays tribute to DS