ముఖ్యమంత్రికి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కృతజ్ఞతలు
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల కేటాయించినందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాకు అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల రావడానికి తన వంతు కృషి చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. గతంలో ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు పలుమార్లు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. లేఖ నంబర్ 06/2024 (తేది: 30-09-2024) ద్వారా...