. . . శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
సిరికొండ, బతుకమ్మ :
సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో గాడి మాకుల రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథోత్సవం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, రావుట్ల గ్రామంలో ఇంత ఘనంగా రాజరాజేశ్వర స్వామి జాతర, రథోత్సవం జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్వామివారి ఆశీస్సులతో రావుట్ల గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, పీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎర్రన్న, నిజామాబాద్ రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
