నిజామాబాద్ ఇన్‌చార్జి మంత్రిని కలిసిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
బతుకమ్మ, హైదరాబాద్ నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన సీతక్కను హైదరాబాదులోని మంత్రి క్యాంప్ ఆఫీసులో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి మంత్రిని సన్మానించారు. అనంతరం రూరల్ నియోజకవర్గం, నిజామాబాద్ జిల్లా గురించి, పార్టీ బలోపేతం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఇన్‌చ్‌ర్జి మంత్రి సీతక్కతో చర్చించారు.