కాంగ్రెస్ అభ్యర్థులకు బి-ఫామ్‌లు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి బి-ఫామ్‌లు అందజేశారు. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం అభ్యర్థులకు బి ఫామ్ లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరించి, పార్టీ అభ్యర్థులందరూ సమిష్టిగా పనిచేసి విజయం సాధించాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలని ఆయన...