Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 6:18 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ అభ్యర్థులకు బి-ఫామ్‌లు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి బి-ఫామ్‌లు అందజేశారు. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం అభ్యర్థులకు బి ఫామ్ లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరించి, పార్టీ అభ్యర్థులందరూ సమిష్టిగా పనిచేసి విజయం సాధించాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరపున 1వ డివిజన్ నుంచి అగ్గు భోజన్న,3వ డివిజన్ నుంచి సంధ్యారాణి, 4వ డివిజన్ నుంచి తరుణ్, 5వ డివిజన్ నుంచి ఈగ రమేష్, 13వ డివిజన్ నుంచి తారాచంద్, 18వ డివిజన్ నుంచి హనుమండ్లుకు బి-ఫామ్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగా రెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాగా రెడ్డి, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.