Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 5:05 pm Posted by : ramakrishna

బోధన్ రూరల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ

బతుకమ్మ, బోధన్: సర్ధార్ వల్లభభాయి పటేల్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ సమన్వయ దినోత్సవం సందర్భంగా బోధన్ రూరల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాలుర క్యాంప్ నుండి జాడి రోడ్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర నిర్వహించిన రన్ లో  విద్యార్థులు, పోలీసులు, యువకులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్ధార్ వల్లభభాయి పటేల్ దేశ ఐక్యత, సమగ్రత కోసం చేసిన కృషిని అధికారులు స్మరించారు. కార్యక్రమంలో సాలుర ప్రజ్ఞశ్రీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దేశభక్తి, సామరస్య భావాలను యువతలో పెంపొందించుకోవాలని బోధన్ రూరల్ ఎస్ఎచ్ఓ మచ్చందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి  మాట్లాడుతూ, “సర్ధార్ వల్లభభాయి పటేల్ చూపించిన ఐక్యతా మార్గం ప్రతి భారతీయుడు అనుసరించాల్సిన  అని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడంలో పోలీసు సిబ్బందితో పాటు విద్యా సంస్థల సహకారం విశేషమని తెలిపారు.

Run for Unity organized by Bodhan Rural Police Department