బతుకమ్మ, బోధన్: సర్ధార్ వల్లభభాయి పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ సమన్వయ దివస్ను పురస్కరించుకొని బోధన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆచంపల్లి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈ 2కే రన్‌లో విద్యార్థులు, పోలీసులు, యువకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, తహసీల్దార్ విటల్, ఎంవిఐ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, అలాగే బోధన్ పట్టణంలోని ప్రైవేట్ విద్యాసంస్థల అధినేతలు పాల్గొన్నారు. సర్ధార్ వల్లభభాయి పటేల్ దేశ ఐక్యతకు చేసిన కృషిని స్మరించుకుంటూ అధికారులు ఐక్యతా దౌడలో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. యువతలో దేశభక్తి, సామరస్య భావాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
