మోర్తాడ్, బతుకమ్మ: సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్బంగా ” జాతీయ ఐక్యత దినోత్సవం ” సందర్భంగా యూనియన్ హోమ్ సెక్రెటరీ , డైరెక్టర్ ఐ.బి వారి ఆదేశాల మేరకు ” రాష్ట్రీయ ఏక్తా దివాస్ “కార్యాక్రమం శుక్రవారం మోర్తాడ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటి (2 కె రన్ ) కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మోర్తాడ్ ఎస్సై రాము అన్నారు. భారతదేశ ఉక్కుమనిషి గా పేరు పొందిన సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని “రాష్ట్రీయ ఏక్తా దివస్ ” ను జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపు కుంటున్నాము. భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో, దేశ సమగ్రత (ఐక్యత ) కొరకు కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తిగా, భారత దేశంలో గల అన్ని సంస్థానాలను విలీనం చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించారని అందువల్ల ఇతనికి ఉక్కు మనిషి అని పేరు గలది తెలియజేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, యువకులు తదితరులు పాల్గొన్నారు.
