బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేని పాలక పార్టీలు

బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతకై ఉద్యమాలే శరణ్యం ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి కర్రోళ్ల శ్రీనివాస్, ఏఐఎఫ్డీఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీల జనాభా కనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంలో పాలక పార్టీలకు చిత్తశుద్ధి లేదని అందుకు ప్రత్యక్ష నిదర్శనమే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం అని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి కర్రోళ్ల శ్రీనివాస్, ఏఐఎఫ్డీఎస్ జాతీయ కన్వీనర్ కామ్రేడ్ మేత్రి రాజశేఖర్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు....