Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 5:42 pm Posted by : ramakrishna

భద్రాచల రాముడి కళ్యాణానికి రుద్రూర్ తలంబ్రాలు

 

. . . విఠలేశ్వర మందిరంలో గోటితో తలంబ్రాల తయారీ

 

రుద్రూర్, బతుకమ్మ :

 

భద్రాచల సీతారాముల కళ్యాణానికి అందించే గోటి తలంబ్రాల కార్యక్రమం కోటి తలంబ్రాల దీక్ష నిజామాబాద్ జిల్లా రుద్రూర్ గ్రామంలోని విఠళేశ్వర మందిరం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగింది. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు భద్రాచలం నుండి తీసుకొచ్చిన గోటి తలంబ్రాలకు పూజలు జరిపి 300 మంది భక్తులచే 3 గంటల పాటు రామనామ స్మరణ చేయిస్తూ గోటితో వడ్లను ఓలిచి తలంబ్రాలుగా మార్చారు. భక్తులు అక్కడే రామకోటి రామరాజుకు అందజేశారు. 4 వ సారి కళ్యాణానికి 3 క్వింటాల గోటి తలంబ్రాలు తెలంగాణ నుండి అందిస్తూన్నామని రామకోటి రామరాజు తెలిపారు. మేము భద్రాచలం వెళ్లలేక పోయిన కూడా, మేము ఓలిచే తలంబ్రాలు మొదటి సారిగా భద్రాచల కళ్యాణానికి వెళ్లడం ఎన్నో జన్మల పుణ్యఫలం అని భక్తులు తమ ఆనందాన్ని వెళ్లుబుచ్చారు. ఇంతటి అదృష్టాన్ని అందించిన రామకోటి రామరాజును కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

 

Rudrur Talambaralu for the welfare of Bhadrachala Rama